
బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. హోం మంత్రి అనిల్ విజ్ దీనికి సంబంధించిన బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
‘హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రెలిజన్ బిల్లు- 2022’ బలవంతపు మత మార్పిడికి 10 సంవత్సరాల వరకు శిక్షను విధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రశంసించింది. ఈ చట్టం ప్రకారం నిందితుడే తాను నిర్దోషి అని కోర్ట్ ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ ఈ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వం తన సత్తా చాటిందని కొనియాడారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత రాష్ట్రంలో లవ్ జిహాద్, మతమార్పిడుల ద్వారా దేశంపై కుట్రలకు పాల్పడుతున్న కేసులు అరికట్టాలని కోరారు.
ప్రలోభాలతో, మోసం చేసి మతాంతర వివాహాలు చేసుకొని, వివాహం తర్వాత మతం మారాలని వత్తిడి చేయడం పెరుగుతున్నదని, అందుకే ఈ బిల్లు అవసరమైనదని బిల్లు లక్ష్యాలలో పేర్కొన్నారు. అటువంటి వత్తిడులు మత స్వాతంత్య్రంకు భంగం కలిగించడమే కాకుండా, మన దేశ లౌకిక స్వభానికి విఘాతం కలిగిస్తోందని తెలిపారు.
కాగా, హర్యానా మొదటి నుండి మతపరమైన ప్రాంతం. ఇది మానవ నాగరికత వర్ధిల్లిన ప్రాంతం. అయితే, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అక్రమ మతమార్పిడి కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత, సామాజిక సామరస్యం, శాంతి వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు