
— చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి
“అసలు ఇందులో ఇంత గొడవ ఏముంది? బురఖా వేసుకోవడం అనుమతిస్తే సరి! ఏం హిందువు లు బొట్టు పెట్టుకోవడంలేదా? సిక్కులు తలపాగా కట్టుకోవడంలేదా? ఈ బురఖా విషయంలో హిందూ సంఘాలు ఇంత గొడవ ఎందుకు అనవసరంగా విద్యార్ధుల చదువులు దెబ్బతీస్తూ వారి మధ్య మతం గొడవలు?”
“నిజమే ” అంటూ సమూహంలో ఉండీ ఈ చర్చను గమనిస్తున్న ఇద్దరు ఇప్పుడే డిగ్రి లో చేరిన యువతులు ( ఇద్దరూ న్యాయ శాస్త్రం చదువుతున్న యువతులు) వెంటనే స్పందించారు.
నిజానికి ఇది ఒక పెద్ద అస్తిత్వ పోరాటం. నిర్భయంగా సమతాసమాజాన్ని కోరుతున్న ఒక మెజారిటీ సమూహనికీ, నిస్సిగ్గుగా అవసరంలేని ప్రత్యేకత కోరుకునే మైనారిటీ సమూహనికి జరుగుతున్న ధర్మ యుద్ధం. ఒక వర్గం మతం పేరు చెప్పుకొని ప్రత్యేక ఏర్పాట్లు కోరుతోంది. ఇంకొక వర్గం అందరూ సమానం ఈ అనవసర ప్రత్యేక హోదా ఎందుకూ అంటోంది. మరి ఒక సగటు భారతీయుడు ఎటువైపు ఉండాలి?
ఈ మొత్తం వ్యవహరాన్ని నిష్పక్షపాతం గా గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఈ క్రింది అంశాలు గమనించండి.1. Uniform Dress Code, ఎన్నో ఏళ్లుగా అనేక schools లో, కొన్ని కాలేజీ ల లో ఉన్నది ఇది కొత్తగా ఇప్పుడు వచ్చిన రూల్ కాదు.2. ప్రతీ విద్యాలయంలో ఒక అద్యాపకుడు లేదా అధ్యాపకురాలో ఉండి విద్యార్థుల వేషభూషలను గమనించి క్రమశిక్షణతో ఉంచడం కూడా జరుగుతుందీ.
3. ఏవైనా తేడాలు ఉంటే తల్లిదండ్రుల ను పిలిపించి మాట్లాడటం తగిన చర్యలు తీసుకోవడం సామాన్యంగా జరిగే వ్యవహరమే.
4. ఈ హిజాబ్ బురఖా వ్యవహరంలో కొత్తగా ఆ విద్యాలయం లో ఎటువంటి నియమనిబంధనలు మార్చబడలేదు. ఎప్పటిలాగానే నియమాలు ఉన్నాయి.
5. ఇప్పుడు విచిత్రంగా ఒక ఆరుగురు యువతులు మా మతధర్మం అంటూ అద్యాపక వర్గం తో వాదిస్తూ ఉన్న ఒక వీడియో అనేక మాధ్యమాలలో ప్రసారం కావడం మొదలైంది. ( గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటీ అంటే విద్యా సంవత్సరం ఎప్పుడో జూన్ నెలలోనో జులై నెలలోనో ఇంకా ఆలస్యం అయినా సెప్టెంబర్ లోనో మొదలైపోయి ఉండాలి…. ఇన్ని నెలలు వారు ఎలా వచ్చారు??)
6. ఈ అద్యాపక వర్గంతో జరిగిన వాగ్వివాదం వీడియో తీసింది ఎవరు?? ఆ యువతుల తల్లితండ్రులు వచ్చి యజమాన్యంతో మాట్లాడారా, మాట్లాడితే ఆ విషయం పై యజమాన్యం నిర్ణయం ఏమిటి.
7. ఆ ఆరుగురు విద్యార్థినుల వ్యవహారానికి వ్యతిరేకంగా కాషాయ కండువాలు వేసుకున్న విద్యార్థులు ఎవరు. వారు అలా ఎందుకు చేశారు?? వారి వాదన ఏమిటి??
8. ఇంత చిన్న అంశాన్ని ఏదో పెద్ద ఉపద్రవం అన్నట్లుగా ” ఇంటర్వూ లు” చేసి తలకెత్తుకున్న సంస్థ ఏది?? ఎందుకు అలా చేసింది??.
9. ఈ మధ్యలోనే ఒక ముస్లిం యువతి బురఖా ధరించి, ఊరేగింపుగా వస్తున్న హిందూ యువకుల మధ్యలో నిలబడి మతపరమైన నినాదం ఇస్తున్న ఒక వీడియో బాగా ప్రసారమయింది. కాలేజీ గేటు వైపు గా స్కూటీ పార్క్ చేసి కెమెరా వైపుగా రావటం ( కాలేజీ లోపలకి పోకుండా…), కెమెరాను zoom చేస్తూ ఆ అమ్మాయి మీదనే నిలపడం, frame లోకి ఊరేగింపు వచ్చే దాకా కెమేరాను తిప్పడం. ఉరేగింపులోకి ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. ఆ కాలేజి అద్యాపక సిబ్బంది ఎవరో ఇది గమనించి ఆ యువతిని లోపలికి పంపడం అంత స్పష్టంగా కనబడుతున్నా. ఆ యువకుల సంయమనం, ఆ వీడియో తీస్తున్న వారు, ఆ యువతి రెచ్చగొట్టే వ్యవహరం స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా ఎటువంటి దుర్భుద్ధి లేక పోతే ఆ సమయంలో ఏ యువతి అయినా అంత మందిలో అటువంటి రెచ్చగొట్టే నినాదాలు చేయదు. ఆ విడియొ యాదృచ్చికంగా తీసినదే అనుకున్నా ఆ యువతి కాలేజి లోకి వెళ్ళకుండా కెమెరా ఉన్న వ్యక్తి వైపు ఎందుకు వచ్చింది? వందల మంది యువకులు వస్తూ ఉంటే ఆ సవ్వడి ఆ దూరం నుండి వినబడదా?? వినబడినా కావాలని రెచ్చగొట్టే ఉద్దేశంతోనే అక్కడకు వచ్చిందా??10. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమేరికా లాంటి దేశాల్లో ని భారత వ్యతిరేక లాబీలన్నీ ఇదే విషయం పై స్పందించడం దేనిని సూచిస్తుంది??
ఇలా ఒక క్రమ పద్ధతిలో గమనిస్తే ఇంత చిన్న విషయాన్ని ఏదో పేద్ద అంతర్జాతీయ సమస్య గా మార్చిన వారు ఎవరో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇప్పుడు నిజమైన భారతీయులు గుర్తించాల్సిన అంశాలు
1. విధ్వంసం కోరే వారు ధైర్యంగా వీడియోలు తీసి మరీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మన దాకా రాలేదు కదా అని ధర్మ పన్నాలు పలుకుతూ కూర్చున్నారు.
2. ఎవరైతే విభజన కోరుతారో ( మన స్వాతంత్య్ర సమయం లో లాగా), వారు మొదట్లో ఇలాంటి చిన్న చిన్న ప్రత్యేక సదుపాయాలే కోరారు చరిత్ర చదివితే తెలుస్తుంది.
3. రెచ్చగొట్టే వారిని వీరులుగా భావిస్తున్నారు, అంతా సమానంగా ఉండాలి అని కోరుకునే వారిని చూసి నవ్వుతున్నారు.
మనం ప్రశాంతంగా జీవించాలి అంటే సమాజం లో చిన్న విషయాలను పెద్దవిగా చేసి భూతద్దం లో చూడకూడదు అనుకుంటూ పోయి అఖండ భారతం ఇన్ని ముక్కలు అయ్యేవరకూ నోరుమూసుకున్న వారికంటే చిన్న పామునైనా పెద్ద కఱ్ఱ తో కొట్టాలి అనే వారు నయమేమో ఒక్కసారి ఆలోచించాలి.
మనకు అంత ఆలోచించే సమయం లేదనుకుంటే అన్నీ పూర్తి గా గమనించకుండా నిర్ణయించడం కూడా సమంజసం కాదు.
(వ్యాసకర్త ప్రముఖ సినీ కళాకారులు, రచయిత)
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్