
`ఆఫ్‌లైన్‌లో పరీక్షలు’ అంటూ ప్రచారంలోకి వచ్చిన సర్క్యులర్‌పై యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) స్పందిస్తూ తాము ఎటువంటి సర్క్యులర్‌లు జారీ చేయలేదని, అది నకిలీదని ట్వీట్ చేసింది. అన్ని యూనివర్శిటీలు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తాయంటూ ఒక సర్క్యులర్ సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ సర్క్యులర్‌పై యుజిసి ట్విటర్ వేదికగా వివరణనిచ్చింది. ఆ సర్క్యులర్ తాము జారీ చేయలేదని, నకిలీదని స్పష్టం చేసింది. అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు కరోనా నిబంధనల పాటిస్తూ పనిచేస్తున్నందున .. వారి నివాసానికి సమీపంలోని కేంద్రాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆఫ్‌లైన్ పరీక్షలు జరగవచ్చని ఆ నకిలీ సర్క్యులర్‌లో ఉంది.
ప్రస్తుత సెమిస్టర్, రానున్న సెమిస్టర్ పరీక్షలను కూడా ఇదే విధానంలో నిర్వహించాల్సిందిగా యూనివర్శిటీలను ఆదేశిస్తున్నట్లు కూడా ఉంది.
కాగా, గురుగోవింద్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) సోమవారం నుండి ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభించాయి. కరోనా ఉధృతి తగ్గడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆ యూనివర్శిటీలు తెలిపాయి. సోమవారం నుండి అన్ని తరగతులు, లైబ్రరీ సేవలు పున:ప్రారంభించినట్లు వెల్లడించాయి.
More Stories
మూడో తరగతి నుంచే ఏఐ!
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి