ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగాఖండించాలరు. కేసీఆర్…. ఇదేనా మీ సంస్కారం? 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఝానం ఏమైపోయింది? అంటూ ఆయన ప్రశ్నించారు.
దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది? అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమవుతారా? అంటూ నిలదీశారు.
కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? నీ భాషను చూసి దేశమంతా అసహ్యించుకుంటుంటే ప్రధానికి ముఖం చూపించలేక తప్పించుకున్నావా? అంటూ కేసీఆర్ తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తాన్నారని పేర్కొంటూ ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానిస్తారు… మీ కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ ఎద్దేవా చేశారు.
కాగా, రాష్ట్రానికి ప్రధాని వస్తే ప్రొటోకాల్ ప్రకారం సీఎం హోదాలో అటెండవుతానని, అందులో అనుమానం ఎందుకని మొన్న ప్రెస్మీట్లో చెప్పిన కేసీఆర్.. తీరా ప్రధాని పర్యటన సమయంలో మాత్రం దూరంగా ఉండటం, అసలు కారణమేమిటో సీఎంవో నుంచి కూడా అధికారికంగా ప్రకటన విడుదల కాకపోవడం గమనార్హం.
ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికే బాధ్యతలను ఆయన టూర్కు ఒక్కరోజు ముందు అంటే శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సీఎం కార్యాలయం అప్పగించింది. ప్రధాని పర్యటనకు మంత్రి తలసానిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నామినేట్ చేసినట్లు ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఐదు రోజుల కింద కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్పై విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని కామెంట్లు చేశారు.
రాష్ట్రానికి ప్రధాని వస్తే.. ప్రొటోకాల్ ప్రకారం వెళ్లి స్వాగతం పలుకుతానని అదే రోజు మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బదులిచ్చారు. కానీ.. శనివారం రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి మాత్రం ఆయన స్వాగతం పలకలేదు. ఉదయం నుంచి ప్రగతిభవన్లో కేసీఆర్ ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వైరం పెరిగినందునే ప్రధాని కార్యక్రమంకు సీఎం హాజరు కాలేదని తెలుస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్ల తర్వాత బీజేపీకి, టీఆర్ఎస్కు ‘నువ్వా నేనా’ అన్నట్లు రాజకీయ పోరు నడుస్తున్నది.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం