వచ్చే ఏడాది విమెన్స్ ఐపీఎల్‌

వచ్చే ఏడాది విమెన్స్ ఐపీఎల్‌
పురుషుల ఐపీఎల్ మాదిరిగానే వ‌చ్చే ఏడాది విమెన్స్ ఐపీఎల్ నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ వెల్లడించాయిరు. దీనికి పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్టుతెలిపారు. వచ్చే ఏడాది (2023) నాటికి పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించడానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయని  గంగూలీ చెప్పారు.
మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది మాజీ క్రికెటర్లతోపాటు ఫ్యాన్స్ మహిళల ఐపీఎల్‌ని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాజాగా సౌరవ్ గంగూలీ కీలక ఈసారి మేలో ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రానున్న కాలంలో మహిళల ఐపీఎల్ ను కూడా నిర్వహిస్తామని గంగూలీ స్పష్టం చేశారు.
అదే సమయంలో టీమ్ ఇండియా ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుందని గంగూలీ ప్రకటించారు. టీమిండియా తరపున ఆడే పురుషులను ఏ లీగ్‌లో పాల్గొనడానికి బీసీసీఐ అనుమతించడం లేదు. కానీ, మహిళలు కచ్చితంగా ఇతర దేశాల టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు అనుమతి ఉంది.
 ఆస్ట్రేలియా క్రికెట్ నిర్వహించే బీబీఎల్ నుంచి న్యూజిలాండ్ సూపర్ లీగ్ ల‌లో పాల్గొని భారత మహిళా క్రీడాకారులు తమ స‌త్తా చాటుతున్నారు. గత ఏడాది చివర్లో కూడా సౌరవ్ గంగూలీ మహిళల ఐపీఎల్‌ను త్వరలో నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే మూడు-నాలుగు నెలల్లో దీని గురించి కీలక ప్రకటనలు చేస్తామ‌ని అప్ప‌ట్లోనే గంగూలీ ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో చెప్పారు. త్వరలో మహిళల ఐపీఎల్ ప్రారంభం అవుతుందని, విదేశీ ఆటగాళ్లను కూడా ఆహ్వానించాలని అనుకుంటున్న‌ట్టు చెప్పారు.