జనవరిలో రికార్డు స్థాయిలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూలయ్యాయి. 1.49 లక్షల కోట్లు వసూలయ్యాయని కేంద్ర శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ సమావేశంలో పేర్కొన్నారు. పరోక్ష పన్నుల విధానం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇదే అత్యధిక వసూలని తెలిపారు.
ఈ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 24 శాతం అదనమని.. 2020తో పోలిస్తే 35 శాతం ఎక్కువ. కాగా, సోమవారం మూడు గంటల సమయానికి రూ.1.38 కోట్లు వసూలయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
ఇందులో కేంద్ర జిఎస్‌టి (సిజిఎస్‌టి) రూ.24,674 కోట్లు, రాష్ట్రాల జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి) రూ.32,016కోట్లు, సమ్మిళిత జిఎస్‌టి (ఐజిఎస్‌టి) కింద రూ. 72,030 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 35,181కోట్లతో కలిపి) ఉన్నాయి
. సెస్ రూపంలో రూ. 9,674కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.517 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. మంగళవారం మొత్తం జనవరి నెలకు కలిపి.. 1.49 లక్షల కోట్లు వసూలైనట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం