
“మత మార్పిడిలను నిషేధిస్తూ చట్టం చేయాలి… ఎవ్వరిని బలవంతంగా మతమార్పిడి చేయడం తగదు… ” ఈ మాట అన్నది ఏ బిజెపి నాయకుడో, హిందుత్వవాదో కాదు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.
పంజాబ్ ఎన్నికల ప్రచర్మలో భాగంగా జలంధర్ లో వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ శనివారం మాట్లాడుతూ మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేయాలని, అయితే చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఎవరినీ వేధించవద్దని సూచించారు. .
పైగా బలవంతంగా ఎవ్వరిని మతమార్పిడి చేయరాదని ఆయన స్పష్టం చేశారు. “మతం అనేది ఏ వ్యక్తి కైనా వ్యక్తిగత వ్యవహారం. ప్రతి ఒక్కరికి ఏదైనా మతం లేదా మతపరమైన గ్రంధాన్ని ఆరాధించే హక్కు ఉందని నేను భావిస్తున్నాను, అయితే ఎవరైనా డబ్బు ద్వారా ఆకర్షించి లేదా వారిని వేధించడం ద్వారా మతం మారితే అది తప్పు” అని ఆయన స్పష్టం చేశారు.
పంజాబ్లో, ముఖ్యంగా జలంధర్లో పేదలకు డబ్బు అందించి ప్రలోభాలకు గురిచేస్తూ మతమార్పిడులు జరుగుతున్నాయని చెబుతూ, వాటిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించినప్పుడు ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
అటువంటి మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేయాలా? అని అడిగినప్పుడు, “మత మార్పిడులకు వ్యతిరేకంగా ఒక చట్టం ఖచ్చితంగా రూపొందించాలి. అయితే అలాంటి చట్టాన్ని ఎవరినీ వేధించడానికి దుర్వినియోగం చేయకూడదు” అని ఆయన పేర్కొన్నారు. డబ్బు చూపి ప్రలోభాలకు గురిచేసి మతం మార్చడం తప్పని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు.
More Stories
గగన్యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో
ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించటం అసాధ్యం
అన్ని మతాలను గౌరవిస్తాను