
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, హోం క్వారంటైన్లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
గడిచిన కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లు ఐసోలేషన్లో ఉండాలని, అవసరమైతే కొవిడ్ టెస్టు చేయించుకోవాలని రాజ్నాథ్ కోరారు. ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కూడా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.
గత రెండు వేవ్స్ సమయంలో కరోనా నుంచి తప్పించుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం వైరస్ కు చిక్కానని ఆమె పేర్కొన్నారు. జలుబుతో బాధపడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని.. ఒంటరిగా ఉండటం తనకు నచ్చడం లేదన్నారు. కాబట్టి తనను ఎంటర్ టైన్ చేయాలని ఫ్యాన్స్ ను కోరారు. ప్రముఖ్న టుడు, కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సత్యారాజ్ కు ఈ మధ్యనే కరోనా సోకింది.
మూడో వేవ్ మొదలు కావడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పడకలు, ఆక్సిజన్, మెడిసిన్ లాంటి వాటికి ఇబ్బంది లేకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లాక్ డౌన్, ఆంక్షలకు సంబంధించి పూర్తి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. సంక్రాంతి తర్వాత ముఖ్య మంత్రులతో ప్రధాని చర్చించి నిర్ణయం తీసుకుంటారాని కిషన్ రెడ్డి తెలిపారు.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
ఐఎస్ఐ కోసం గూఢచర్యంలో యూట్యూబర్ వసీం అరెస్ట్
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్