
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదయ్యాయి. మరో 327 మంది మృతి చెందారు. కోవిడ్ నుంచి నిన్న ఒక్కరోజే 40వేల 863 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో పాజిటివిటి రేటు 10.21శాతం గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసులు 5 లక్షల 90 వేల 611గా ఉన్నాయి.
ఇటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహమ్మారి విస్తరించిందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో కొత్తవేరియంట్ విజృంభిస్తోంది. అక్కడ వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 513 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడులో రోజురోజుకు కేసులు పెరిగుతున్నాయి.
ముంబయి నగరంలోనే 20 వేల 318 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు చనిపోయారు. బాంద్రాలోని సీబీఐ కార్యాలయంలో కరోనా పరీక్షలు నిర్వహించగా 68 మంది సీబీఐ స్టాఫ్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
ప్రస్తుతం ముంబయి నగరంలో 1 లక్షా 6వేల 37 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. పుణే నగరంలో 60 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 185కి చేరుకోగా.. వీరిలో 27 మంది పోలీసు ఉన్నతాధికారులే ఉన్నారు.
More Stories
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి