
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎపికి ఎన్జిటి షాక్ ఇచ్చింది. ఈ పథకం పట్ల మొండిగా వెళుతున్న ఎపికి ట్రిబ్యునల్లో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా రాయల సీమ ఎత్తి పోతల పథకం పనులు చేపట్టవద్దని జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
కృష్ణానది పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై శుక్రవారం ట్రిబ్యునల్ తీర్పు వెల్లడిం చింది. ప్రాజెక్టు నిర్మాణానికి సం బంధించి పనులపై అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సమగ్రంగా పరిశీలించి నాలుగు నెలల్లో నివేదిక అందజే యాలని సూచించింది.
రాయలసీయ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాల అమలులో ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన కోర్టుధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపడితే మాత్రం అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాద్యత వహించాల్సివుంటుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ హెచ్చరించింది.
ఒకవేళ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎపిని హెచ్చరించింది. ఎపి ప్రభుత్వం రాయల సీమ ఎత్తిపోతల పథకాన్ని ఏవిధమైన అనుతుల్లేకుండా చేపట్టిందని, ఈ పథకం వల్ల తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని, ఈ పథకాన్ని తక్షణం నిలిపి వేయించాలని దాఖలైన పిటీషన్లపై ఏడాదిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ జరుపుతూ వచ్చింది.
కృష్ణానది జలాల్లో తమ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాను వినియోగించుకునేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని, ఈ పథకం కొత్తది కాదని, ఈ పథకం పనులు చేపట్టడం వల్ల పర్యావరణానికి ఏవిధంగా నష్టం లేదని ఎపి ప్రభుత్వం హరిత ట్రిబ్యునల్లో వాదిస్తూ వచ్చింది.
ఎపి వాదనలను అంగీకరించని ట్రిబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపి వేయాలని తాము చేప్పేదాక ఎటువంటి పనులు చేపట్టరాదని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథక పనులు చేస్తోందని ఫిర్యాదు దారుడు ట్రిబ్యునల్ దృష్టికి తీసుకుపోయారు.
దీనిపై స్పందించిన ట్రిబ్యునల్ కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నదీ లేనిది పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కమిటి రెండు నెలల కిందటే నివేదిక సమర్పించింది.
నివేదికను పరిశీలించిన ట్రబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దరాదని తీర్పునిచ్చింది. అంతే కాకుండా ఈ పథాన్ని మరింత సమగ్రంగా అధ్యయనం చేసే బాధ్యతలను నిపుణుల కమిటికి అప్పగించింది.
ఈ కమిటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి డిపిఆర్తోపాటు ఇతర సాంకేతిక పరమైన అంశాలను, క్షేత్ర స్థాయిలో పనుల తీరును పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు నాలుగు నెలలు గడువు కేటాయించింది. నిబంధనలకు విరుద్దంగా పనులు చేపడితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుంటుందని , ఈ సారి కఠిన చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరిస్తూ ఎపి ప్రభుత్వాన్ని . ట్రిబ్యునల్ కట్టడి చేసింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము