
రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేశారని, డీజీపీ, పోలీసులకు ఫోన్లు చేస్తే స్పందించరని మండిపడ్డారు. ఘటనాస్థలికి తాను వెళ్లేసరికి దాడి చేసినవారిని పోలీసులే పంపిస్తున్నారని పేర్కొంటూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఏపీలో మూలాలున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో 23వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సహజవనరులను ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల కమిషనర్‌పై దాడులు చేసి ఇంటికి పంపించే వరకు ఊరుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తమపై దాడులు చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రెండేళ్లుగా జగన్‌రెడ్డి చేస్తున్న పరిపాలనపై బుక్ రూపొందించిన టీడీపీ.. ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారని చెప్పారు. రాజమండ్రి శిరోముండనం కేసును కూడా ప్రస్తావించారు. మీరు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అమరావతి రాజధాని ఏమైందని అడిగారు. దానికి చంద్రబాబు బదులిస్తూ వైఎస్ జగన్‌ను అమరావతిని ధ్వంసం చేశారని చెప్పారు.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్