గతంలో ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 22న సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది.
ఆదిమూలపు సురేష్తో పాటు ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన సతీమణి విజయలక్ష్మిపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ 2016లోనే కేసు నమోదు చేసింది. 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
కాగా.. దీనిని సవాల్ చేస్తూ సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సీబీఐ ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలు ఉన్నందున మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో నేడు సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More Stories
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
ప్రైవేటు వ్యక్తులకు లక్షన్నర ఎకరాల ఆలయ భూములా?