
ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక అధికార కేంద్రంగా మారారు. ప్రభుత్వ వ్యవహారాలపై కన్నా రాజకీయ వ్యవహారాలపై ఆయన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఒక వంక ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ పరంగా వేధింపులు సాగించే పక్రియ సాగిస్తూనే, మరోవంక ఉన్నతాధికారులనే కాకుండా చివరకు ప్రభుత్వ ఉద్యోగులను సహితం నియంత్రిస్తున్నారు.
“ఉద్యోగులకు చెల్లించవలసి పెండింగ్ బకాయిలు అన్ని వెంటనే చెల్లించాలి. మేము పోరాటాలకు సిద్ధం” అంటూ మీడియా ముందు గర్జిస్తున్న ప్రభుత్వ ఉద్యోగసంఘాల నేతలకు నేరుగా సజ్జల ఫోన్ చేసి `ఆదేశాలు’ ఇవ్వడాన్ని మీడియా ప్రతినిధులు అందరు చూసారు.
ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని అమరావతి ఏపీ జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఉన్న ఏపీ జేఏసీ అమరావతి లలో సభ్యులుగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల అసోసియేషన్ లు, ఉపాధ్యాయ సంఘాలు, క్లాస్-4 , ప్రభ్యుత్వ డ్రైవర్ల సంఘాలు, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ లతో ఈ సమావేశం జరిగింది.
విస్తృతంగా చర్చించి ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు సంయుక్తంగా కృషి చేయాలని అవసరమైన పక్షంలో పోరాటానికి సంయుక్త కార్యాచరణ తో ముందుకు సాగాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన్నట్లు వారు ఆ తర్వాత ప్రకటించారు.
అత్యవసరమైన తమ సమస్యలాలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, ఇప్పటికే అలస్యమైనందున ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఉద్యోగసంఘాల నేతలు మైకుల ముందు ఉండగానే… ‘పైనుంచి’ ఫోన్ వచ్చింది. ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు ‘సార్ సార్… నమస్తే సార్’ అంటూ అవతలి వ్యక్తితో వినయంగా మాట్లాడారు.
అటువైపు నుంచి ఎలాంటి ఆదేశాలు/సూచనలు వచ్చాయో తెలియదు కానీ, ‘సార్… కంట్రోల్… ఉంటాం సార్! కంట్రోల్‌లోనే ఉంటాం సార్’ అని శ్రీనివాసరావు బదులిచ్చారు. ఆ తర్వాత… ‘అదేమీ ఉండదు సార్! గవర్నమెంట్‌కు యాంటీగా ఏమీ ఉండదు సార్’ అని కూడా హామీ ఇచ్చారు. ‘పైనుంచి’ ఫోన్ చేసిన వ్యక్తి… మరో ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు గురించి అడిగినట్లు ఉంది! ‘సార్.. సార్… పక్కనే ఉన్నారు సార్’ అని బండి శ్రీనివాసరావు ఫోన్‌ను బొప్పరాజుకు ఇచ్చారు. ‘ఎవరు’ అని ఆయన అడగడంతో… ‘సజ్జల సార్… సజ్జల సార్’ అని బదులిచ్చారు.
అవతలి మాటలు వినిపించనప్పటికీ ఉద్యోగ నేతల స్పందనను బట్టి చూస్తే, సజ్జల వారితో కఠినంగా మాట్లాడినట్లు, బెదిరింపు ధోరణి ప్రదర్శించిన్నట్లు స్పష్టం అవుతుంది. ఉద్యోగుల ఆర్ధిక బకాయిలు, ఉద్యోగులు దాచుకున్న జి పి ఎఫ్ /ఏపీ జీ ఎల్ ఐ మొత్తములు, ఇతర ఆర్థిక పరమైన చెల్లింపులు విషయంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పినా నిర్దుష్ట కార్యాచరణను అదోగసంఘాలు ప్రకటించాక పోవడం గమనార్హం.
More Stories
చంద్రబాబుకు అమరావతి రైతులు 10 రోజుల అల్టిమేటం!
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు