
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయనిర్బంధంలోకి వెళ్లనున్నారు. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాలకు హాజరకానున్నట్లు క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రధాన మీటింగ్‌లన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. తజక్ నేత ఎమ్మోమలి రెహమాన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్ మాట్లాడారు. అయితే తాను ఉంటున్న ప్రదేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని, కొన్ని రోజుల పాటు సెల్ఫ్ స్వీయనిర్బంధంలో ఉండనున్నట్లు పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు.
మంగళవారమే సిరియా అధ్యక్షుడు అసద్ భాషర్ను పుతిన్ కలిశారు. క్రెమ్లిన్‌లో ఆ సమావేశం జరిగింది. సిరియా యుద్ధంలో అసద్‌కు పుతిన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అసద్‌కు పుతిన్ కంగ్రాట్స్ తెలిపారు.
అధ్యక్ష భవనంలో చాలా మందికి కరోనా సోకడం వల్ల కూడా పుతిన్ స్వీయనిర్బంధం కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోనే స్వదేశీ స్పుత్నిక్ టీకాను పుతిన్ వేసుకున్న విషయం తెలిసిందే.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన