బెంగాల్ బిజెపి ఎంపీ ఇంటిపై మరోసారి బాంబుల దాడి

ఉత్తర 24 పరగణాల జిల్లా జగదల్‌లోని బిజెపి ఎంపి అర్జున్ సింగ్ ఇంటి వెలుపల బాంబు పేలుడు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏ చేపట్టిన 24 గంటల్లోపు, అలాంటి మరొక సంఘటన మంగళవారం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) దాడికి పాల్పడిందని సింగ్ ట్విట్టర్‌లో ఆరోపించారు.

“సెప్టెంబర్ 8 న నా ఇంటి ముందు, ఈ ఉదయం ఇంటి వెనుక బాంబులు విసిరారు. నేరస్థులకు భయం లేదు ఎందుకంటే వారికి టిఎంసి @WBPolice రక్షణ ఉంది. నేరస్థులు బహిరంగంగా తిరుగుతున్నారు, పోలీసులు తృణమూల్  ‘దాల్దాస్’ అయ్యారు. అలాంటి దాడులకు నేను ఎప్పుడూ భయపడలేదు, నేను భయపడను ‘అని ఆయన ట్వీట్ చేశారు.

పైగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసే భబానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బిజెపి తనను పరిశీలకుడిగా సోమవారం రాత్రి నియమించగా, మంగళవారం ఉదయమే ఈ బాంబు దాడి జరిగినదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ స్థలం నుండి క్రూడ్ బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 

జగద్దల్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తకు ముందు తన ఇంటిపై దారిగిన బాంబు దాడి కేసు దర్యాప్తు  ఎన్ఐఏ  కి ఇచ్చినప్పటి నుండి తనపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు బాంబులు విసిరినట్లు బారక్‌పూర్ ఎంపీ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, తాము విచారణ ప్రారంభించామని, బాంబులు విసిరినవి కాదని, సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉంచామని పోలీసులు తెలిపారు.  సెప్టెంబర్ 8 న, ఆయన నివాసంపై కనీసం మూడు ముడి బాంబులు విసిరారు.