ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా వేడుకలను ఈ ఏడాది సైతం నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. మైసూరు దసరా రాష్ట్ర పండుగ అని, గతేడాది సైతం కరోనా మహమ్మారి కారణంగా నిరాడంబరంగా జరుపుకున్నామని, ఈ సారి సైతం అలాగే నిర్వహిస్తామని చెప్పారు.
ఈ మేరకు ఆయన ఆదివారం ఉత్సవాల నిర్వహణపై కమిటీ సమావేశం బొమ్మై అధ్యక్షతన జరిగింది. చాముండి హిల్స్‌పై ఉత్సవాలు ప్రారంభమై పది రోజుల పాటు జరుగుతాయని, జంబూ జవారీ నిర్వహించనున్నట్లు చెప్పారు. మైసూరు, చామరాజనగర్, శ్రీరంగపట్నంలో దసరా పండుగను జరుపుకునేందుకు రూ.6కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
దసరా వేడుకలకు సంబంధించి మైసూరులో మౌలిక సదుపాయాలకు అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఉత్సవలు, సాంస్కృతిక కార్యక్రమాలన్ని ఈ సారి అంబ విలాస్ ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయానికి పరిమితం చేశారు.
గతేడాదిలాగా మైసూరు ప్యాలెస్ ప్రాంగణంలోనే జంబూ సవారీ జరుగనుంది. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 7న చాముండి హిల్స్‌లో ప్రారంభం కానున్నాయి. జాంబూ సవారీ అక్టోబర్ 15న మధ్యాహ్నం 2.45 గంటలకు జరుగుతుంది.

More Stories
జైషే హ్యాండ్లర్ నుంచి బాంబు తయారీ వీడియోలు
కశ్మీర్ టైమ్స్ ఆఫీస్‌లో ఏకే-47 క్యాట్రిడ్జ్‌లు
ఎన్ఐఏ కస్టడీకి నలుగురు ఢిల్లీ పేలుడు కీలక నిందితులు