ఇన్‌ స్ట్రాగ్రామ్‌ పరిచయమే రమ్య ప్రాణాలు తీసింది!

సోషల్‌ మీడియాలో ముక్కుమొహం తెలియని వారితో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆ పరిచయాలు స్నేహంగా మారుతున్నాయి. స్నేహం నుండి కొందరు ప్రేమిస్తున్నానని వేధించే కేసులూ పెరుగుతున్నాయి. ఆ కోవకు చెందినదే గుంటూరు బిటెక్‌ రమ్య హత్య. 
 
నిందితుడి శశికృష్ణతో ఇన్‌ స్ట్రాగ్రామ్‌ లో రమ్యకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులు తరువాత ప్రేమించమని విధించేవాడు. దీనికి రమ్య ఒప్పులేదు. దీంతో అతడిని దూరంగా పెట్టింది రమ్య. కానీ నిందితుడు వెంటబడి వేధిస్తూనే ఉండేవాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమెను ఆపి, బైక్‌ ఎక్కమని బలవంతపెట్టాడు. 
 
రమ్య ఒప్పుకోకపోవడంతో కత్తితో తన చేయి కోసుకుంటానని బెదిరింపులకు దిగాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో చేతిలో ఉన్న కత్తితో రమ్యను పొడిచి పరారైయాడు. నడిరోడ్డుపై రక్తపు మడుగులలో కొట్టుకుంటూ ఆసుపత్రికి చేరేలోపు ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ కేసులో నిందితుడు శశికృష్ణ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఇంఛార్జి డి.ఐ.జి. రాజశేఖర్‌ బాబు తెలిపారు. అర్బన్‌ పోలీసులు నింధితుడిని అరెస్ట్‌ చేసే టైంలో అతను బ్లేడ్‌ తో కోసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 
 
సోషల్‌ మీడియా పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విశాల్‌ గున్నీ ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న అక్క, చెల్లెళ్ళు సోషల్‌ మీడియాలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రమ్యపై దాడి జరుగుతుంటే పక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉండిపోవడం బాధాకరం అని చెప్పారు. 
 
రమ్య హత్య సమయంలో ఎవరు అడ్డు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, సమాజంలో మార్పు తీసుకురావాలిసిన అవసరం ఉందని తెలిపారు. మహిళా భద్రత కోసం ఎన్నో ప్రచారాలు నిర్వహించాలని భావిస్తున్నారు.