దోపిడీ ఆరోపణలపై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్, మరో ఐదుగురు పోలీసులతోపాటు, మరో ఇద్దరు వ్యక్తులపై కేసునమోదు చేశారని పోలీసు అధికారి తెలిపారు. బిల్డర్ ఫిర్యాదు మేరకు దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేశారు.
బిల్డర్ భాగస్వాముల్లో సునీల్, సంజరు పునామియా పోలీసు అధికారులతో కుట్ర పన్ని తనపై ఉన్న కొన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. 15 కోట్లు డిమాండ్ చేశారని బిల్డర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సునీల్, సంజరు పునామియాలను పోలీసులు అరెస్టు చేశారు.
అలాగే డబ్బులు డిమాండ్ చేసినవారిలో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్ కూడా ఉన్నారు. అందుకే బిల్డర్ ఫిర్యాదులో పరమ్బీర్సింగ్పాటు, మరో ఐదుగురు పోలీసులపై ఫిర్యాదు చేయడంతో అధికారులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కేసులో పరమ్‌బీర్‌సింగ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను ముంబై పోలీస్ కమిషనర్‌గా ఆయన హోదాను తొలగించి డిజి – హోమ్ గార్డ్‌గా బదిలీ చేశారు.

More Stories
జార్ఖండ్‌లో 15 మంది మావోయిస్టులు మృతి
ఢిల్లీ గాలి కాలుష్యంపై నాలుగు వారాల్లో ‘యాక్షన్ ప్లాన్’
సరిహద్దులో కాల్పులకు తెగబడి తోకముడిచిన పాక్