
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా, కుల్గాంలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పుచాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
కుల్గాంలో మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాంలోని జోడార్ ప్రాంతంలో బుధవారం ఉదయం కుల్గాం పోలీసులు, 1 ఆర్ఆర్ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.
ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో నిన్న ఒక ఉగ్రవాది హతమవగా, ఇవాళ తెల్లవారుజాము నుంచి మరో ఇద్దరిని మట్టుబెట్టారు. కాగా, కశ్మీర్లో గత 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులు, భద్రతా బలగాలను అభినందించారు.
More Stories
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
లోక్‌పాల్ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం