సేఫ్ జోన్ లో యుపి… అదుపులో కరోనా రెండో వేవ్

సేఫ్ జోన్ లో యుపి… అదుపులో కరోనా రెండో వేవ్

కోవిడ్ -19 రెండో వేవ్ ను  తమ ప్రభుత్వం మందలించగలిగిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు, రాష్ట్రం ఇప్పటికే కోవిడ్ సేఫ్ జోన్‌లో ఉందని ప్రకటించారు. కోవిడ్-ప్రభావిత జిల్లాల రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా డియోరియా, ఖుషినగర్ జిల్లాల పర్యటనలో  ఆదిత్యనాథ్ మాట్లాడుతూ యుపి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా, సవాళ్లు చాలా రెట్లు ఉన్నాయని చెప్పారు. 

అయితే సమిష్టి కృషతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన “ట్రేస్, టెస్ట్, ట్రీట్” మంత్రాన్ని సమర్ధవంతంగా తమ ప్రభుత్వం అమలు చేయడంతో చాలా  తక్కువ వ్యవధిలో సమగ్ర, సానుకూల ఫలితాలను సాధింప గలిగామని చెప్పారు. కొంతమంది నిపుణులు లేవనెత్తిన ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్ -19 రెండొవ వేవ్ లో  పెరిగిన వైరస్ వ్యాప్తి  రేటు గురించి కొన్ని తప్పుడు  భయాలకు విరుద్ధంగా, రాష్ట్రం ఇప్పటికే సురక్షిత ప్రాంతంలోకి మారిపోయిందని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. 

రెండో వేవ్ సమయంలో ప్రతిరోజూ ఉత్తర ప్రదేశ్‌లో మే నెలలో లక్ష కరోనా  కేసులు నమోదు అవుతున్నట్లు ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ విధంగా  మే  15 నాటికి మొత్తం క్రియాశీల కేసులు 30 లక్షల వరకు చేరి ఉండవలసింది పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ 30 న గరిష్ట స్థాయిలో, మొత్తం క్రియాశీల కేసులు 3.10 లక్షలు ఉన్నాయి, అవి ఈ నాటికి నేటికీ 62,000 కు కున్నాయని ఆదిత్యనాథ్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తరువాత చెప్పారు.

రాష్ట్రంలో బుధవారం 3,371 కొత్త కోవిడ్ -19 కేసులు, 196 మరణాలు నమోదయ్యాయి.  రాష్ట్రంలో మొత్తం మరణాలు 19,712 గా ఉన్నాయి. రాష్ట్రంలో కఠినమైన లాక్ డౌన్  విధించకూడదని తమ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల జీవనోపాధిని కాపాడటానికి సహాయపడిందని ముఖ్యమంత్రి చెప్పారు.

“కఠినమైన లాక్ డౌన్ కు  బదులుగా, మేము జీవితాన్ని,  జీవనోపాధిని కాపాడటానికి పాక్షిక కరోనా కర్ఫ్యూను స్వీకరించాము. ఈ కారణంగా, వ్యవసాయ రంగం, పండ్లు,  కూరగాయల మండిలు,   అన్ని ఇతర ముఖ్యమైన సేవలలో ఎటువంటి సమస్య ఏర్పడలేదు,” అని వివరించారు.

డియోరియా కోసం నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లతో రాష్ట్రంలో 300 కి పైగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు మూడో వేవ్ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెబుతూ జిల్లా ఆసుపత్రులలో ఐసియు సదుపాయాలను,  కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో మినీ ఐసియు లను కరోనా రోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. 

దేశంలో ఎక్కువ కరోనా టెస్ట్ లను ఉత్తర ప్రదేశ్ లోనే నిర్వహించామని చెబుతూ బుధవారానికి 4.87 కోట్ల టెస్ట్ లు జరిపినట్లు ఆదిత్యనాథ్ వెల్లడించారు. 300కు పైగా రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేశామని చెబుతూ అన్ని జిల్లాలను ఆక్సిజన్ కు సంబంధించి స్వయం సమృద్ధి కాయవంచమని తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాలను కరోనా నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యేక కృషి చేతున్నామని చెబుతూ  నిఘా బృందాలను ఏర్పాటు చేసి, కరోనా రోగులను గుర్తించి, వారిని క్వారంటైన్ లలో ఉంచడం కోసం ప్రత్యేక మెడికల్ కిట్ లను అందిస్తున్నామని వివరించారు. కోవిద్ అనంతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా చికిత్స సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ వారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు.