
నేపాల్ పార్లమెంట్ రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీ ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 12,19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షురాలి కార్యాలయం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చేశారని, మొదటి సాధారణ ఎన్నికలు నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19న నిర్వహించాలని ఆదేశించినట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
నేపాల్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం అధికార, విపక్షాలు ముందుకొచ్చాయి. అధికార, విపక్షాలు ముందుకొచ్చిన గంటల వ్యవధిలోనే ఆమె ఈ అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు షేక్ బహదూర్ దేవ్బా, కేపీ శర్మ ఓలి చేసిన విజ్ఞప్తిని ఆమె తోసిపుచ్చారు.
ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ బలనిరూపణకు వెనక్కి తగ్గగా, రాష్ట్రపతి విద్యాదేవి భండారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు.
ఈ క్రమంలో తమకు 149 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విపక్ష కూటమి ముందుకు వచ్చింది. అయితే, విపక్ష అభ్యర్థనను అధ్యక్షురాలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక