
భేటీలో ఛత్తీస్‌గఢ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, బెంగాల్ అధికారులు పాల్గొన్నారు.వందేళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా జిల్లా అధికారులు తమ విధులు నిర్వర్తించటం సవాల్గా మారిందని పేర్కొన్నారు. యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని, అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఇన్‌ఫెక్షన్ అనేది ఏ కొద్దిగా మిగిలినా మన ముందున్న సవాలు పూర్తిగా తొలగనట్టేనని ప్రధాని మోదీ చెప్పారు.
అందుబాటులో ఉన్న వనరులతో మహమ్మారిపై పోరాడాలని ప్రధాని సూచించారు. కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెంది వ్యాప్తి చెందుతోందని చెబుతూ వైరస్‌పై విధానాలు, వ్యూహాలు నిత్యం మార్చుకోవాలని చెప్పారు. మ్యుటెంట్ల నేపథ్యంలో యువత, చిన్నారులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
కరోనా బారినపడిన యువత, చిన్నారుల వివరాలు సేకరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు తమ జీవనాన్ని సులభతరం చేసేందుకు ఉచిత రేషన్, ఇతర నిత్యావసర సామగ్రి అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరారు.
ప్రాణాలు కాపాడడడంతో పాటు ప్రతి వ్యక్తి జీవన సౌలభ్యం తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. పేదలకు ఉచిత రేషన్ సౌకర్యాలు ఉండాలని, నిత్యావసర సరుకులు నల్లబజారుకు తరలించకుండా చూడాలని చెప్పారు. ఇవన్నీ పోరాటంలో గెలిచేందుకు, ముందుకు సాగేందుకు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.
More Stories
కూలిన విమాన నిర్వహణలో సంబంధం లేదన్న టర్కీ
అయిల్ క్షేత్రాలు, రక్షణ కార్యాలయంపై మెరుపు దాడులు
నాగారంలో భూదాన్ భూముల స్వాహాకు కుట్ర