
లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మనత్రివర్గం నిర్ణయించింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు.
ఉదయం 10 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. అలాగే వ్యాక్సిన్ కొరత నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబర్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని, లాక్‌డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన నాలుగు రోజులకే మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తెలంగాణ హైకోర్టుతో సహా పలువురు లాక్‌డౌన్ విధించడమే సరైన మార్గమని చెబుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గం భేటీలో లాక్‌డౌన్ వైపు మొగ్గు చూపారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది