
భారత దేశ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ఎన్ వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. పరిమితమైన అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. తెలుగువాడయిన జస్టిస్ రమణ నియామకం పట్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా పొన్నవరంలో జన్మించిన రమణ విద్యాభ్యాసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కంచికచర్ల, అమరావతి లలో జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్ లో లా డిగ్రీ పొందారు. అనంతరం న్యాయవాదిగా రెండు దశాబ్దాల పాటు ప్రాక్టీస్ చేశారు. 2000 వ సంవత్సరంలో ఉమ్మడి హైకోర్టు లో న్యాయమూర్తిగా ప్రవేశించారు. తర్వాత బదలీపై ఢిల్లీ హైకోర్టుకి వెళ్లారు. అక్కడ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. పలు కీలక కేసుల్లో గంభీరమైన తీర్పులను జస్టిస్ రమణ వెలువరించారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?