గతేడాది కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో.. లైంగిక హింస పెరిగిందని ఐక్యరాజ్యసమితి (యుఎన్) తాజాగా నివేదికను వెల్లడించింది. కోవిడ్ సమయంలో.. మొత్తం 18 దేశాల్లో 52 సైన్యాలు లేదా సాయుధ మూకలు మహిళలపై అకఅత్యాలకు పాల్పడినట్లు తమ వద్ద ధ్రువీకృత సమాచారం ఉందని ఆ నివేదికలో స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సైన్యాలు, సాయుధ మూకలు… లైంగిక హింసను ఒక యుద్ధవ్యూహంగా, రాజకీయ అణచివేతకు ఉపయోగించుకున్నాయని తెలిపింది.
ఈ దారుణాలకు పాల్పడుతున్న వాటిలో అత్యధిక శాతం ప్రభుత్వేతర మూకలు ఉన్నాయి. ప్రతిపక్షాలు, తిరుగుబాటు దారులు, అల్‌ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధమున్న ఉగ్రమూకలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ జాబితాలో ఉన్న ప్రభుత్వ సైన్యం లేదా అధికారిక పోలీసు బలగాలను ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల్లో పాల్గనకుండా నిషేధించాం. ఈ బ్లాక్‌లిస్ట్‌లో కాంగో, దక్షిణ సూడాన్‌లోని ప్రభుత్వ, పోలీసు బలగాలు, సిరియా నిఘా వర్గాలు, సూడాన్‌లో సాయుధ బలగాలు ఉన్నాయి.
చాలా చోట్ల మహిళల అవసరాల్ని ఆసరాగా చేసుకుని, వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు” అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

More Stories
హర్మూజ్ దాటిన తొలి భారత ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్
ఆర్టెమిస్-2 వెనుక భారతీయ సంతతి శాస్తస్రవేత్త అమిత్ క్షత్రియా
చంద్రుడిని చుట్టి భూమికి చేరిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు