దక్షిణా కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రావాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
పుల్వామాలోని ఘాట్ మొహళ్లా కాకపోరా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వారికీ ధీటుగా భారత సైన్యం ఎదురుదాడి చేసింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఇద్దరు తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుల్వామా జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన
అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!
ఐదు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు