
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్ దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న వేశారు.
ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన కలెక్టర్.. ఆమె దొంగ ఓటు వేసినట్లు తేల్చారు. దీంతో స్వప్న రాజీనామా చేయాలని బల్దియా ఆఫీసు ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఓ ప్రజాప్రతినిధి దొంగ ఓటు వేయడంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 14 మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఓటరు ఇంటి పేరు స్వప్న ఇంటి పేరు ఒకటే కావడంతో ఆమె ఎవరికి అనుమానం రాకుండా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. తోటికోడలు పేరుతో స్వప్న ఓటు వినియోగించుకున్నారనే అభియోగంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే ఆధార్ కార్డు తో వోట్ వేయడానికి వెళ్లానని, అన్ని సరిచూసుకొనే తనను వోట్ వేయనిచ్చారని చెబుతూ అప్పుడు అక్కడున్న అభ్యర్థుల ఏజెంట్లు ఎవ్వరు కూడా అభ్యంతరం తెలపలేదని ఆమె చెబుతున్నారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే