ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిజిపిగా పనిచేసిన, తిరుమల పవిత్రతకై జరిగిన ఉద్యమానికి నేతృత్వం వహించిన టి ఎస్ రావు తమ 85వ ఏట సోమవారం నాడు మృతి చెందారు. హిందూ సమాజ రక్షణకు,దేశ భద్రతకు అవసరమైన పలు అంశాలపై ముందు ఉండి నాయకత్వం వహించిన గొప్ప మార్గదర్శి మృతి చెందడం పట్ల తిరుమల తిరుపతి సంరక్షణ సమితి నేత కె శ్యామ్ ప్రసాద్ అంజలి ఘటించారు.
కృష్ణ జిల్లాలో జన్మించిన తాళ్లూరి సూర్యనారాయణ రావు చిన్నప్పటి నుండి మేధావి.గణితంలో దిట్ట.మంచి ఉపాధ్యాయుడు కావాలన్నది వారి జీవన లక్ష్యం.కానీ వారు ఐపీఎస్ కు ఎంపికై, ప్రారంభంలో గుజరాత్లో పనిచేసి, 1983లో ఎన్ టి రామారావు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అయ్యారు.
ఆనాడు మత ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే .హైదరాబాద్లో శాంతితయుత పరిస్థితులు ఏర్పరచడం లో వారు కృతకృత్యులయ్యారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు డిజిపిగా పదవీ విరమణ చేసిన అనంతరం 1996 లో అర్.ఎస్.ఎస్.తెలంగాణ ప్రాంతపు సమ్మేళన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆ కార్యక్రమానికి ఆ నాటి అర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ ప్రో.రాజేంద్ర సింహ విచ్చేశారు.
జన్మతః వారికి ధార్మిక భావాలు మెండు.చాలా కాలం హైదరాబాద్ శృంగేరి శాఖకు ధర్మ కర్తగా ఉన్నారు.2005లో తిరుపతి,తిరుమలలో అన్య మత ప్రచార సంఘటనలు ప్రజలలో ఆందోళనలు కల్గించాయి.వాస్తవాలు తెల్సుకోవడం కోసం కర్ణాటక కు చెందిన ఉడిపి పితాధి పతి పూజ్య విస్వేశ్వ తీర్థులు జస్టిస్ బిక్షపతి గారి నేతృత్వంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు.ఆ కమిటీలో టి.ఎస్.రావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు.
ఆ కమిటీ తిరుమల,తిరుపతి లను సందర్శించి నివేదికను ఉడిపి స్వామీజీ కి అందచేశారు. తిరుమల తిరుపతి లో అన్యమత ప్రచారం నిజమని నివేదిక తెలుపడం తో తిరుపతిలో అనేకమంది ధర్మాచార్యులు,కర్ణాటక,తమిళనాడు ,ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన భక్తులతో ఒక పెద్ద హిందూ సమ్మేళనం జరిగింది.పెజావరు స్వామి టీ.ఎస్.రావు గారి అధ్యక్షతన తిరుమల తిరుపతి సంరక్షణ సమితిని ప్రకటించారు.
టి.టి. డి.అధికారులతో, దేవాదాయ శాఖ మంత్రి తో పలు దఫాలు చర్చలు జరిపారు. భక్తులు తిరుమల పవిత్రత సంరక్షణకు ఉద్యమించారు.అనేక గ్రామాల్లో రథ యాత్ర లు జరిగాయి.ఉపవాస దీక్షలు జరిగాయి.హిందూ సమాజం మేల్కొన్నది. చిట్ట చివరకు ఆ నాటి ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి రెండు జిఓలు జారీ చేశారు.
ఆ జీవుల ప్రకారం తిరుమల ఏడు కొండలూ స్వామీ వారి దివ్య క్షేత్రం.అక్కడ అన్య మత ప్రచారం చేయరాదు అలా చేస్తే శిక్షార్హమైన ది. అట్లాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 23 దేవాలయాల వద్ద అన్య మత ప్రచారం చేయడం శిక్షార్హమైనదిగా ప్రకటించారు.
హిందూ దేవాలయాల వద్ద తమకు మత ప్రచారం చేయడం తమ హక్కు అని క్రైస్తవ మత ప్రచారకులు భావిస్తున్న తరుణంలో,సూడో సెక్యులరిస్టులు,కొన్ని రాజకీయ పార్టీలు వీరిని సమద్ధిస్తున్న వేల ఈ రెండు జిఓలు వెలువడడంలో టి.ఎస్.రావు గారి నేతృత్వపు గొప్పతనం కనపడుతుంది.ఈ ఉద్యమం ఆధునిక హిందూ ధర్మ రక్షణ ఉద్యమంలో ఒక మైలు రాయి.
2007 అనంతరం కూడా అనేక అంశాల పై తిరుమల తిరుపతి సంరక్షణకు వారు మార్గ దర్శనం చేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం .క్రైస్తవ మత ప్రచారంకు కేంద్రమైంది. కడప జిల్లా కు చెందిన ఒక విద్యార్థిని ఆత్మ హత్య చేసుకుంది. ఆ సందర్భంలో టి.ఎస్.రావు స్వయంగా విశ్వ విద్యాలయం వచ్చి వివరాలు సేకరించి నివేదికను తయారు చేశారు.
తిరుపతి చంద్రగిరి మార్గంలో ఇస్లామిక్ మహిలా విశ్వ విద్యాలయం అనుమతులు లేకుండా నిర్మాణంపై నిజ నిర్ధారణ కమిటీ లో పాల్గొన్నారు. కేరళ వెళ్లి లవ్ జిహాద్ ఘటనల పై వాస్తవాలు సేకరించి ఒక నివేదికను అంద చేశారు.
More Stories
సిఆర్డిఏ పరిధిని పునరుద్ధరించిన ఏపీ మంత్రివర్గం
టీటీడీ ఛైర్మన్గా ప్రమాణం చేసిన బీఆర్ నాయుడు
అమరావతి పాత టెండర్లు రద్దు