కన్నడ నటి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్న జయశ్రీ రామయ్య ఇవాళ మధ్యాహ్నం బెంగళూరులోని నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
జయశ్రీ 2020 జులై 22న ఫేస్ బుక్ లో నన్ను ఫాలో అవుతున్న ప్రపంచానికి, డిప్రెషన్ గుడ్‌బై చెబుతున్నానంటూ పోస్ట్ పెట్టింది. జయశ్రీ పోస్టుతో నెటిజన్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే ఆ వెంటనే జయశ్రీ తన పోస్టును తొలిగించి.. ‘నేను బాగానే ఉన్నాను. సురక్షితంగా ఉన్నా. లవ్ యూ ఆల్’ అంటూ మరో అప్డేట్ పోస్టు పెట్టింది.
జులై 25న సోషల్ మీడియా హ్యాండిల్లో లైవ్ లో మాట్లాడుతూ..’నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయడం లేదు. సుదీప్ సర్ నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సాయాన్ని ఆశించడం లేదు. నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నా చిన్ననాటి నుంచి చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నా..కానీ వాటిని అధిగమించలేక డిప్రెషన్ లోకి వెళ్లా. నేను డిప్రెషన్ ను హ్యాండిల్ చేయలేకపోతున్నా. నేను కేవలం చావును ఆశిస్తున్నానంటూ’ పేర్కొంది.
జయశ్రీ బిగ్‌బాస్ సీజన్ 3లో 17 మంది కంటెస్టెంట్స్ తో కలిసి కనిపించింది. 2017లో శాండల్‌వుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. జయశ్రీ ఆకస్మిక మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More Stories
సర్‌క్రీక్ వద్ద భారత త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం