ఢిల్లీలో `పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాల క‌ల‌క‌లం  

దేశ రాజ‌ధానిలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు క‌ల‌క‌లం రేపాయి. ఖాన్ మార్కెట్ ప్రాంతంలో శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన తర్వాత ఒంటి గంట స‌మ‌యంలో తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌కు ఓ ఫిర్యాదు అందింది. ఖాన్ మార్కెట్ మెట్రో స్టేష‌న్ ద‌గ్గ‌ర ఎవ‌రో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వ్య‌క్తి వెల్ల‌డించారు.

దీంతో పోలీసులు వెంట‌నే అక్క‌డికి వెళ్లారు. ఈ నినాదాలు చేసిన ముగ్గురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు పురుషుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా విదేశీయులు. యులు  బైక్స్ తీసుకొని అక్క‌డ చక్క‌ర్లు కొడుతున్నారు. రిపబ్లిక్ డేకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

వాళ్ల‌ను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లి ప్ర‌శ్నించ‌గా  తాము సైట్ సీయింగ్ కోసం భారత్ కు  వ‌చ్చామ‌ని చెప్పారు. బైక్స్‌పై రేసింగ్ చేస్తున్నామ‌ని, ఈ సంద‌ర్భంగా ఒక‌రినొక‌రం త‌మ దేశాల పేర్లు పెట్టుకొని పిలుచుకున్నామ‌ని తెలిపారు.

ఆ రేసు సందర్భంగా ఓ పాకిస్థానీ వ్యక్తిని గుర్తించామని, అతడు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేశాడని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఇంకా ప్రశ్నిస్తున్నారు