వ్యాపారవేత్తగా మారిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపి కె.డి సింగ్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం అరెస్ట్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై కె.డి సింగ్ 2014 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అంతకుముందు, సింగ్ జార్ఖండ్ ముక్తి మోర్చాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అతను ఒక పెద్ద చిట్ ఫండ్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్కెమిస్ట్ గ్రూపును స్థాపించి, 2012 వరకు చైర్మన్ గా ఉన్నారు. ఈ కంపెనీ స్థావరాలను 2019 సోడా చేశారు.
రూ 1,900 కోట్ల పోంజి  కుంభకోణంలో మనీలాండరింగ్ సంబంధించి సింగ్‌పై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత టిఎంసి బహిష్కరణకు గురయ్యారు. గత ఏడాది ఏప్రిల్ లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగింసింది.
దీంతో బుధవారం ఢిల్లీలో విచారణకు పిలిచి తరువాత  అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సింగ్ ను ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అతనిపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ, జార్ఖండ్ ఇతర రాష్ట్రాలలో ఇడి దర్యాప్తు జరుగుతోంది.
                            
                        
	                    
More Stories
టాటా ట్రస్ట్స్ పై న్యాయపోరాటంకు మెహ్లీ మిస్త్రీ
దేశ ఆర్థిక వ్యవస్థపై టెక్ రంగంలో లేఆఫ్స్ ప్రభావం
షట్‌డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం