రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్యగా ఆయన దీనిని అభివర్ణించారు. హిందూ ఆలయాలపై దాడులను సీఎం ఎందుకు ఖండించడం లేదని పవన్ ప్రశ్నించారు.
జగన్ ఏ మతాన్ని విశ్వసించినా పరమతాన్ని గౌరవించాలని హితవు చెప్పారు.
గత దాడులను పట్టించుకోక పోవడం వల్లే వరుసగా దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తా రు. ప్రణాళికాబద్ధంగానే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలల నుంచి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎంపీ రాఘురామ కృష్ణమరాజు లేఖ రాశారు. ఇప్పటి వరకు వంద ఆలయాలపై దాడులు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దుండగులు శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేసి, తలనరికి ఎత్తుకుపోయారని తెలిపారు. హిందూ ఆలయాలపై దాడుల విషయంలో కేంద్రం కమిటీని నియమించాలని రఘురామ కృష్ణమరాజు ఆ లేఖలో కోరారు.

More Stories
మానవ సేవ దైవ సేవ అని చెప్పిన సత్యసాయి
పోలవరం నిర్మాణ తీరును పరిశీలించిన కేంద్ర బృందం
దిగ్బ్రాంతి కలిగిస్తున్న విజయవాడలో మావోయిస్టుల షెల్టర్ జోన్!