పార్లమెంటుపై దాడి పిరికిపంద చర్య   

పార్లమెంటుపై దాడి పిరికిపంద చర్య   
ప్రజాస్వామిక దేవాలయమైన భారత పార్లమెంటుపై దాడి పిరికిపంద చర్య అని, దీనిని మన దేశం ఎన్నటికీ మర్చిపోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.   

2001 డిసెంబరు 13న పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు. 

‘‘2001లో ఇదే రోజున మన పార్లమెంటుపై పిరికిపంద దాడిని మనం ఎన్నటికీ మర్చిపోము. పార్లమెంటు పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయినవారి ధైర్యసాహసాలు, త్యాగాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. వారికి భారత దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుంది’’ అని మోదీ పేర్కొన్నారు. 

పార్లమెంటుపై దాడి సమయంలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించే కార్యక్రమం పార్లమెంటులో జరిగింది. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.