 
                ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ మేగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పలువురు భారతీయ వనితలకూ చోటు దక్కింది. 
జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మొదటిస్థానాన్ని కైవసం చేసుకోగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్ మల్హోత్రాలు కూడా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాకు ఎంపికయ్యారు. 
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన భారత సంతతి మహిళ కమలా హ్యారి్సకూ ఇందులో చోటు లభించింది. ఇక ఐరోపా కేంద్ర బ్యాంకు చీఫ్ క్రిస్టిన్ లగార్డే వరుసగా రెండో ఏడాది కూడా రెండోస్థానంలో నిలవడం విశేషం. 
10 దేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, 38 కంపెనీల సీఈవోలు, వినోదరంగానికి చెందిన ఐదుగురు ప్రముఖులనూ ఈ జాబితాకు ఎంపిక చేశారు.  
                            
                        
	                    




More Stories
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత