
‘2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డు’ను ఇన్వెస్ట్ భారత్ గెలుచుకోవడం పట్ల ప్రధాని మోడీ అభినందించారు. ఇన్వెస్ట్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీ.
ప్రపంచ పెట్టుబడులకు భారత్ కేంద్రస్థానమనేందుకు ఈ అవార్డు ఓ నిదర్శనమని ప్రధాని ట్విట్ చేశారు. సులభతర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని ప్రధాని తెలిపారు.
2020 పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డుకు ఇన్వెస్ట్ ఇండియాను వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస సమాఖ్య(అంక్టాడ్) విజేతగా ప్రకటించింది. జెనీవాలోని అంక్టాడ్ ప్రధాన కార్యాలయంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
180 దేశాల పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలపై మదింపు జరిపిన అంక్టాడ్ ఈ అవార్డుకు ఇన్వెస్ట్ భారత్ ను ఎంపిక చేసింది.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!