రాజ్యాంగ నిర్మాత భీమ్‌రావ్ రామ్‌జీ అండేడ్కర్ సేవను ఆయన 64వ వర్ధంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలచుకున్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానం, సిద్ధాంతాలు ఇప్పటికీ చాలా మందికి బలాన్ని ఇస్తున్నాయని ఆయన తెలిపారు.
. ప్రతి ఏడాది ఈ రోజును మహాపరినిర్వాణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ విషయాన్ని మోదీ తన ట్వీట్‌లో గుర్తు చేస్తూ ‘మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను గుర్తు చేసుకుందాం” అని తెలిపారు.
“ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు లక్షలాది మందికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మన దేశం గురించి ఆయన కన్న కలలను నెరవేర్చే దిశగా మేం కట్టుబడి ఉన్నాం” అని ఆ ట్వీట్ లో ప్రధాని స్పష్టం చేశారు.
పరినిర్వాణ పదానికి బౌద్ధ సంప్రదాయంలో లోతైన అర్థం దాగుంది. పరినిర్వాణ అంటే ఓ వ్యక్తి తన జీవితకాలంతోపాటు మరణం తర్వాత కూడా మోక్షం పొందిన వ్యక్తి అని చెప్పొచ్చు.

More Stories
ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలియదనుకుంటా!
తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు