 
                రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర  కమిషన్ కు  ఎదురుదెబ్బ తగిలింది.ఓట్ల లెక్కింపుకు సంబంధించి అర్థరాత్రి జారీ చేసిన సర్క్యులర్ ను సస్పెండ్ చేసింది. స్వస్తిక్ గుర్తున్న బ్యాలెట్లనే లెక్కించాలని ఆదేశించింది.  జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్  గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న ఎన్నికల  కమిషన్ ఉత్తర్వలును హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్ట్ తదుపరి ఉత్తర్వులకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
బ్యాలెట్‌పై స్వస్తిక్ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి  తీసుకోవాలంటూ గత రాత్రి అధికారులకు ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిస బీజేపీ  హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 
బీజేపీ పిటిషన్‌ను  విచారించిన ధర్మాసనం స్వస్తిస్ గుర్తు కాకుండా ఏ గుర్తు ఉన్నా కోర్టు తదుపలి ఆదేశాలకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.   గ్రేటర్లో ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యూలర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇతర గుర్తులున్న బ్యాలెట్లను పక్కన పెట్టాలని సూచించింది. వేరే గుర్తును ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించింది. ఎన్నికలు రాజ్యాంగానికి లోబడే జరగాలని చెప్పింది.  వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారంకు హైకోర్టు వాయిదా వేసింది.
                            
                        
	                    




More Stories
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్
అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై బీజేపీ ఫిర్యాదు