ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ పిడిపి యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పారాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అదుపులోకి తీసుకుంది. సోమవారం ఎన్ఐఎ ఆయనను అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా నుండి ఇటీవల విడుదలైన జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో పారా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ముజాహుద్దీన్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయంటూ ఎన్ఐఎ అరెస్టు చేసింది.
శ్రీనగర్ నుండి న్యూఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధాన కార్యాలయానికి తరలించి, విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పిడిపి పునరుద్ధరణకు, ముఖ్యంగా పుల్వామాలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
సస్పెండ్కి గురైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డావిందర్ సింగ్ కేసు విచారణ సమయంలో ఉగ్రవాదులతో అతని సంబంధం బయటపడింది.

More Stories
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు
ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ!
ఢిల్లీ పేలుడులో సూత్రధారులు ఐదుగురు వైద్యులు!