పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై ఆగంతకులు రాళ్ల దాడి చేశారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ముర్షిదాబాద్ జిల్లా కంది ప్రాంతంలో వెళుతుండగా అతని కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు.
దిలీప్ ఘోష్ బహరాంపూర్ పట్టణంలో జరగనున్న బీజేపీ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతుండగా కొందరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాన్వాయ్ పై రాళ్లు రువ్వారని ముర్షిదాబాద్ బీజేపీ నాయకులు చెప్పారు.
ఈ రాళ్ల దాడిలో దిలీప్ ఘోష్ కాన్వాయ్ లోని కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. ఈ దాడి ఘటనపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బీజేపీ నాయకుడి కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడితో తమపార్టీకి సంబంధం లేదని టీఎంసీ నేతలు చెప్పారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ పార్టీ కార్యకర్తల మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు సాగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

More Stories
ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తేజస్వీ యాదవ్
బడ్జెట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు
స్టాలిన్- విజయ్ మధ్య తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్!