
12 సంవత్సరాలకు ఓసారి వచ్చే పుష్కర పూజలను మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులవారు శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ అశేష భక్త జనం మధ్య ఈ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉన్న పన్నెండు నదులలో తుంగభద్ర నదికి ప్రత్యేక పవిత్రత ఉందని ఆయన తెలిపారు. అదేమనగా దేశంలో 11 నదుల గంగాజలం సముద్రం పాలైతే తుంగభద్ర గంగాజలం మాత్రం కృష్ణానదిలో కలుస్తుంది అని ఆయన గుర్తు చేశారు.
నదులన్నీ సముద్రం పాలు అయితే ఒక తుంగభద్ర మాత్రం భక్తజనానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే 11 నదుల గంగాజలాన్ని సేకరించిప్రత్యేక పూజలు నిర్వహించి తుంగభద్రా నదిలో సంగమం చేశామని ఆయన పేర్కొన్నారు. అంతేగాక భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన భక్తులను కోరారు. కార్యక్రమంలో కర్నాటక మాజీ మంత్రి అరవింద్ నింబావలి కూడా పాల్గొన్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు