
మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియడ్వాలా భార్య షబానా సయీద్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అదివారంనాడు అరెస్టు చేసింది. ముంబైలోని ఆయన నివాసంలో మాదక ద్రవ్యాలను కనుగొన్న ఎన్సీబీ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుంది.
నడియడ్ వాలా భార్య అరెస్టు వార్తను ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ధ్రువీకరించారు. ఉదయమంతా ఆమెను ప్రశ్నించి సాయంత్రం అరెస్టు చేసినట్టు చెప్పారు. శనివారంనాడు పశ్చిమ ముంబై, నవీ ముంబైలో తాము కీలక దాడులు జరిపామని, కమర్షియల్ క్వాంటిటీలో గంజాయి, మెఢెడ్రోన్, ఇతర మాదకద్రవ్యాలను తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
మాదక ద్రవ్య విక్రేతలను పలువురుని పట్టుకుని, వారిచ్చిన సమాచారంతో ఆదివారం ఉదయం కూడా దాడులు జరిపి కొంత పరిణామంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఫిరోజ్ నడయడ్వాలా బాలీవుడ్ నిర్మాతగా ‘వెల్కమ్’, ‘ఫిర్ హేరా ఫెరి’, ‘అవారా పాగల్ దీవానా’ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!