వచ్చే ఏడాది మొదట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పదిరోజుల్లో విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ ప్రకటించారు.
ప్రస్తుతం ఆమె అక్రమార్జన కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కర్నాటకలోని కోర్టులకు దసరా సెలవులు ముగిసిన తర్వాత శశికళ విడుదలకు సంబంధించిన శుభవార్త వెలువడుతుందనే ఆశాభావం పాండ్యన్ వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు శశికళ వచ్చే యేడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి వుంది. అయి తే శశికళను వచ్చే యేడాది జనవరి చివరలో విడుదల చేసే అవకాశముందని, అంతకు ముందు కోర్టు విధించిన అపరాధపు సొమ్ము రూ.10.10కోట్లను ఆమె చెల్లించాల్సి ఉందని కర్నాటక జైళ్ల శాఖ అధికారులు ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రకటించారు.
అపరాధపు సొమ్ము ఇప్పటికే సిద్ధం చేశామని, శశికళ నుంచి తగిన సమాచారం రాగానే అపరాధపు సొమ్ము తక్షణమే చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాండ్యన్ వెల్లడించారు. కర్ణాటక జైళ్ల శాఖ నిబంధనల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రతి నెలా మూడురోజులపాటు శిక్ష తగ్గే అవకాశముంటుందని అయాన్ చెప్పారు.
ఆ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు శశికళకు 129 రోజులు జైలు శిక్ష తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే శశికళ 43 నెలలపాటు పూర్తిగా జైలు శిక్ష అనుభవించారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో శశికళ ఏ సమయంలోనైనా విడుదలయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆయన తెలిపారు

More Stories
రిటైర్మెంట్కు ముందు జడ్జీల చివరి తీర్పులపై సుప్రీం ఆందోళన
బంగ్లాదేశ్ కల్లోలం భారత్ కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్!
ఆర్మీ అకాడమీలో చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల మహిళా ఆఫీసర్