ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంటిపై బెంగళూరు పోలీసులు సోదాలు జరిపారు. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కర్నాటక మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, వివేక్ ఒబెరాయ్ బావ అయిన ఆదిత్య అల్వా కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఇందులో భాగంగానే వివేక్ ఒబెరాయ్ ఇంట్లో ఆదిత్య ఉన్నాడేమోనని పోలీసులు అక్కడ దాడి చేశారు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు సీసీబీ బెంగళూరు పోలీసులు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు జరిపారు.
‘ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడు. వివేక్ ఒబెరాయ్ అతడికి బంధువు. వివేక్ ఇంట్లో ఆదిత్య ఉన్నాడని మాకు సమాచారం అందింది. అందుకే మేం తనిఖీలు చేయాలనుకున్నాం. కోర్టు వారెంట్ మేరకు సీసీబీ టీమ్ ముంబైలోని వివేక్ ఇంటికి వెళ్లింది’ అని బెంగళూరు అదనపు కమిషనర్ చెప్పారు.
అదిత్య ఎక్కడ ఉన్నాడో వివేక్‌కు తెలిసే ఉంటుందని, ఇంకా దాడి కొనసాగుతోందని చెప్పారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్త చరిత్ర సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు వివేక్ ఒబెరాయ్ పరిచయమయ్యాడు.

More Stories
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు