రెండో సారి కరోనా సోకితే తీవ్ర ప్రభావం 

కరోనా వైరస్‌ నుండి కోలుకున్న వ్యక్తికి రెండోసారి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అమెరికా వైద్యులు తెలిపారు. రెండోసారి కరోనా బారిన పడిన వారిలో లక్షణాల తీవ్రత అధికంగా ఉంటుందని లాన్సెల్‌ జర్నల్‌ తన అధ్యయనంలో పేర్కొంది. ఈ అథ్యయనానికి సంబంధించిన వివరాలు ‘లాన్సెట్‌ ఇనెఫెక్షియస్‌ డిసీజెస్‌’ జర్నల్‌లో ప్రచురించింది. 

అలాగే బాధితుల రోగనిరోధక శక్తిపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అమెరికాలో రెండోసారి వైరస్‌ సోకిన మొట్టమొదటి వ్యక్తిపై అధ్యయనం చేపట్టింది. నెవాడాకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి 48 రోజుల వ్యవధిలో రెండు సార్లు విభిన్న లక్షణాలు కలిగిన సార్స్‌ వైరస్‌తో కరోనాబారిన పడ్డారు. 

అయితే రెండోసారి లక్షణాలు మొదటిసారి కంటే తీవ్రంగా ఉన్నాయని, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరారు. అలాగే బెల్జియం, నెదర్లాండ్స్‌, హాంగ్‌కాంగ్‌, ఈ క్వెడార్‌లలోని రోగులపై ఈ అధ్యయనం చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న సమయంలో.. పున:సంక్రమణ తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది.

ఇప్పటికీ ఈ వైరస్‌ను అరికట్టే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ రూపొందలేదని, దీంతో పున:సంక్రమణలు గణనీయమైన ప్రభావం చూపుతాయని నెవెడా స్టెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ లాబరేటరీ, ప్రధాన అధ్యయన వేత్త మార్క్‌ పండోరి వెల్లడించారు. కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తుల రోగనిరోధక శక్తిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు.