
కరోనా సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన ఉద్యోగ నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఆగస్టులో 1,413గా ఉన్న జాబ్ పోస్టింగులు సెప్టెంబర్‌లో 24% వృద్ధిచెంది 1,755కు చేరినట్టు ‘నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్’ తన తాజా నివేదికలో తెలిపింది.
ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉద్యోగ నియామకాలు ఫార్మా రంగంలో 44%, ఎఫ్‌ఎంసీజీ రంగంలో 43%, విద్య-బోధన రంగంలో 41%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో 32%, రియల్ ఎస్టేట్ రంగంలో 44%, దాని అనుబంధ రంగంలో 29%, ఆతిథ్య-పర్యాటక రంగంలో 48% పెరిగాయని వెల్లడించింది.
అలాగే బీపీవోలు, ఐటీ ఆధారిత సేవల రంగంలో 29%, బ్యాంకింగ్-ఆర్థిక సేవల రంగంలో 33% చొప్పున నియామకాలు పెరిగినట్టు తెలిపింది. ప్రభుత్వం అన్‌లాక్ చర్యలతో ఆర్థిక వ్యవస్థ ద్వారాలను తెరువడం, ప్రయాణాలు ఊపందుకోవడం ఇందుకు కారణమని పేర్కొన్నది.
మెట్రో నగరాలవారీగా చూస్తే పుణెలో ఉద్యోగ నియామకాలు సెప్టెంబర్‌లో 26% పెరిగాయని, 24% వృద్ధితో హైదరాబాద్, చెన్నై ద్వితీయ స్థానంలో నిలిచాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడించింది. కేవలం 14% వృద్ధితో బెంగళూరు తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నట్టు తెలిపింది.
అలాగే ద్వితీయశ్రేణి నగరాలైన అహ్మదాబాద్‌లో 34%, చండీగఢ్‌లో 39%, జైపూర్‌లో 36% చొప్పున నియామకాలు పెరిగినట్టు నౌకరీ డాట్‌కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయెల్ పేర్కొన్నారు.
More Stories
కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మగాళ్లకే
ధనిక దేశాలు భారత్ కు భారీగా పరిహారం చెల్లించాలి
ఆవులు, ప్లకార్డులతో కర్ణాటక బీజేపీ నిరసనలు