బాలికలు 12 పాసైతే రూ 25 వేలు, డిగ్రీ పాసైతే రూ 50 వేలు

బీహార్ లో మళ్లీ అధికారంలోకి వస్తే.. 12వ తరగతి పాసైన బాలికలకు రూ. 25 వేల చొప్పున, డిగ్రీ పాసైన  అమ్మాయిలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు, ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి, స్వయం సమృద్ధి కోసంజేడీయూ రూపొందించిన ‘సాత్ నిశ్చయ్ – 2′ (7 అంశాల రెండో ప్రణాలికను)’ను ఆయన  ప్రకటించారు.  

రాష్ట్రంలో గత ఐదేళ్లలో 7 అంశాల  ప్లాన్ 1ను అమలు చేశారు. వీటికి అదనంగా వచ్చే ఐదేళ్లలో పార్ట్ 2 ప్లాన్ ను అమలు చేయనున్నట్లు నితీశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ‘‘ప్రజలకు సేవ చేయడం మా విధి బీహార్ కు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ సహకారం, ఆశీస్సులతో  7 నిశ్చయ్ పార్ట్ 2ను కూడా అమలు చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపి, స్వయం సమృద్ధిగా నిలబెడతామని ధీమాగా ఉన్నా..” అని ఆయన ట్వీట్ చేశారు. 

నితీష్ కుమార్ హామీలు

  • యువతకు సంకెహ్తిక విద్య, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌ ప్రోత్సాహం
  • ఐటీఐ, పాలిటెక్నిక్ సంస్థల్లో శిక్షణ నాణ్యత పెంచేందుకు ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు
  • జిల్లాల వారీగా జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ ఇచ్చేందుకు మెగా స్కిల్ సెంటర్లు,ప్రతి డివిజన్ లో టూల్ రూంలు, శిక్షణ కేంద్రాలు.  
  • నైపుణ్య అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌ కోసం ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు
  • మహిళల సాధికారికత కోసం.. 12వ తరగతి పాసైన బాలికలకు రూ. 25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ. 50 వేల ఆర్థిక సాయం
  • మహిళా ఎంట్రప్రెన్యూర్స్ కు ప్రాజెక్టు కాస్ట్ లో 50% గ్రాంట్, రూ. 5 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు 
  • కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుకు 50%(గరిష్టంగా 3 లక్షలు), 7% గ్రాంట్లతో 7లక్షల దాకా రుణాలు 
  •  స్థానిక పాలనా, పోలీస్, జిల్లా ఆఫీసుల్లో రిజర్వేషన్ల ద్వారా మహిళల భాగస్వామ్యం పెంపు

వీటితో పాటు.. రైతులకు సాగునీరు, ప్రతి గ్రామంలో సూర్య వీధి దీపాలు, తడి- పొడి వృద్దా యాజమాన్య ప్లాంట్లు, ప్రతి ఇంటికి నల్లా నీళ్లు, మరుగుదొడ్లు, రోడ్ల నిర్మాణం, ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి