ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సొంత దళకమాండర్‌నే హతమార్చిన సంఘటన గురువారం జరిగింది. బస్తర్ రేంజ్ ఐజీ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియాలో పలువురు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు. అయితే ఈ హత్యల నేపథ్యంలో పలువురు అమాయక ఆదివాసీలు సైతం హత్యకు గురయ్యారు.
ఈ క్రమంలో గంగులూరు డీవీసీ ఏరియా కమిటీ కమాండర్ విజా మొడియం అలియాస్ భద్రు (34) కొంతకాలంగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వారిని హత్య చేశారనే సమాచారం మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలకు చేరింది.
దీంతో గురు వారం గంగులూరు–కిరండోల్ మధ్యలోని ఎటావర్ అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టు ముఖ్య నేతలు సదరు కమాండర్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది.

More Stories
భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బి వీసా దారులు
దేశంలో 40 లక్షలే గన్ లైసెన్సులు
తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 73 లక్షల ఓట్ల తొలగింపు