నయాం కేసు సమాధి…. 25 మంది పోలీసులకు క్లీన్ చిట్ 

నయాం కేసు సమాధి…. 25 మంది పోలీసులకు క్లీన్ చిట్ 

గతంలో సంచలనం కలిగించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసును సమాధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించినట్లున్నది. తాజాగా ఏకంగా ఈ కేసులో నిందితులైన 25 మంది పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. 

నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత  బయటపడిన సమాచారంపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నయీంతో సంబంధాలు ఉన్నాయని ల్యాండ్‌ సెటిల్‌మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న 25  మంది పోలీస్ అధికారులకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని తేల్చింది. 

వీరిలో ఇద్దరు అదనపు అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు,13 మంది సీఐలు, హెడ్‌కానిస్టేబుల్‌  ఉన్నారు. వారిపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను నుంచి తొలగిస్తున్నట్లు చెప్పింది. 

నయీం కేసులో 175కి పైగా సిట్ చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఇందులో 130కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నాయకుల పేర్లు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ వరకు అందరికీ ఇవాళ సిట్ క్లీన్‌చిట్ ఇచ్చేసింది.   

దీనికి సంబంధించి పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు.  

 నయీం ఎన్‌కౌంటర్‌  పెద్ద ఎత్తున నోట్ల కట్టలను, బంగారు ఆభరణాలను, వజ్రాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన పోలీసులు ఇప్పుడు వాటి ఉస్ ఎత్తడం లేదు. అక్కడ దొరికిన నోట్లను లెక్క పెట్టడం కోసం రెండు రోజులపాటు నోట్లు లెక్కించి మిషన్ లను ఉపయోగించినట్లు ప్రచారం చేసిన పోలీసులు ఇప్పుడు ఆ నగదు గురించి ప్రస్తావించడం లేదు.

అట్లాగే ఎన్నో అక్రమ భూలావాదేవీలు, మారు పేర్లతో భూములు ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు ఇప్పుడు అటువంటి భూముల గురించే ప్రస్తావించడం లేదు. నయాం వద్ద దొరికిన ఆస్తులు అన్నింటిని ఉన్నత పోలీస్ అధికారులు, కీలక రాజకీయ నేతలు కలసి స్వాహా చేశారా అనే అనుమానాలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. 

మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ప్రతినిధులు కోరారు.