దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పనిచేయబోతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ ఆరోపించారు.
టీఆర్ఎస్కు ఓటు వేయమని కాంగ్రెస్ నేతలు ప్రచారం ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో గ్రూప్‌లకు, వర్గాలకు తావు లేదని ఆమె స్పష్టం చేశారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజక్టును కట్టలేని కేసీఆర్‌కు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు లేదని డీకే అరుణ పేర్కొన్నారు. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాడని ఆమె మండిపడ్డారు.
కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని అరుణ చెప్పారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆమె భరోసా వ్యక్తం చేశారు.

More Stories
కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా
మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మవద్దు!