వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరహార దీక్షకు దిగినట్లు వెల్లడించాయిరు. ఇదే విషయంపై ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.
‘రెండు రోజుల నుంచి రాజ్యసభలో జరిగిన పరిణామాలను నన్ను మానసిక వేదనకు గురిచేశాయి. ఆవేదనలో రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవనీయ సభ్యులు హింస్మాత్మకంగా వ్యవహరించారు. కొందరు రూల్ బుక్‌ను చింపి నాపై విసిరారు’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
మరికొందరు టేబుళ్లపై నిలబడి అసభ్య పదజాలం ఉపయోగించారు. జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే నిద్రకూడా పట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన నిరహార దీక్షతో సభ్యులు కొంతైనా పశ్చాతాపం చెందుతారని ఆశిస్తున్నానని తెలిపారు.
తాను `లోక్ నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ గ్రామానికి చెందిన వాడినని పేర్కొంటూ ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని తన రాజకీయ ప్రస్థానం సైతం బీహార్ నుంచే ప్రారంభమైందని తెలిపారు. వైశాలి ప్రజలకు ప్రజాస్వామ్యం విలువ తెలుసని అంటూ పరోక్షంగా ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు .
మరోవంక, సస్పెన్షన్‌కి గురైన ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు నిన్న పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ధర్నా రెండో రోజూ కొనసాగుతోంది. రాత్రంతా ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలోని పచ్చికలోనే గడిపారు. ఆమాద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తమ ధర్నా తాలూకు ఫోటోలు, వీడియోలను ట్విటర్లో షేర్ చేసుకున్నారు.
ఈ రోజు ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తమకు టీ, స్నాక్స్ తీసుకుని వారి వద్దకు వెళ్లారు. సింగ్ అయితే వాటిని తాము తిరస్కరించామని సంజయ్ వెల్లడించారు. తమకు టీ తీసుకు రావడం మంచి సంకేతమే అయినా… ఆయన చేసింది మాత్రం తప్పేనని డిప్యూటీ చైర్మన్‌కు మరో సీనియర్ ఎంపీ చెప్పినట్టు సంజయ్ తెలిపారు.
మరోవంక, 8 మంది ఎంపీలపై విధించిన వేటును ఎత్తివేయాలని, ప్రైవేటు వ్యక్తులు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకే పంట కొనాలన్న బిల్లును తీసుకువచ్చేంత వరకు విపక్షాలు సభను బహిష్కరిస్తాయని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.
More Stories
మిత్రుడు ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు
ప్రత్యేక హోదా పునరుద్దరించాలని కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు